‘బీఆర్ఎస్’పై బండి సంజయ్ ట్వీట్ 

‘బీఆర్ఎస్’పై బండి సంజయ్ ట్వీట్ 

బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్ లో తనదైన స్టైల్లో స్పందించారు. ‘టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం పందికి లిప్ స్టిక్ పెట్టినట్లు ఉంది. ట్విట్టర్ టిల్లు కేటీఆరేమో  కేసీఆర్ ను గేమ్ చేంజర్ అంటున్నారు. కానీ, తన తండి నేమ్ చెంజర్ అయ్యారు. అంతిమంగా ప్రజలే కేసీఆర్ ను మార్చుతారు’ అంటూ ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు. 

అంతకుముందు.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చారు. టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.  టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ  ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనంతరం పార్టీ పేరులో మార్పు చేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి సమర్పించనున్న దరఖాస్తు పత్రాలపై సంతకాలు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ చేసిన తీర్మానాన్ని గుర్తించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి పార్టీ జనరల్ సెక్రెటరీ  లేఖ రాశారు.