
కేసీఆర్ ప్రభుత్వం సర్పంచులపై ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తుందని అన్నారు సర్పంచ్ సంఘం ప్రతినిదులు. మంగళవారం రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ను పలువురు సర్పంచులు కలిశారు. సర్పంచ్ సంఘం వ్యవస్థాపక అద్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ ను కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని… ఆయనను తొందరగా విడుదలచేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు మద్దతు తెలపాలని లక్ష్మణ్ ను వారు కోరి వినతి పత్రాన్ని ఇచ్చారు.
సర్పంచ్ ల సమస్యలపై మాట్లాడిన లక్ష్మణ్… కేసీఆర్ సర్కారు కావాలనే సర్పంచులపై కక్ష్య సాధింపు చర్యలను చేస్తుందని అన్నారు. సర్పంచ్ లు సాగిస్తున్న పోరాటానికి బీజేపీ మద్దతుగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, మహిళా కార్యదర్శి ధనలక్ష్మీ, నత్తా మల్లేశ్, పాండు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.