
కాంగ్రెస్, బీజేపీ పార్టీలను దగ్గరికి రానివ్వకండి. ఆ పార్టీలు రైతులును మోసం చేశాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బయ్యారంలో రూ.19 కోట్లతో పలు ఆభివృధ్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆయన... బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీజేపీ అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమపై కేసీఆర్ కి గట్టి నమ్మకం వుందన్న ఆయన.. కేంద్రం రూ.1400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గార్ల, రాంపురం వద్ద బ్రిడ్జికి 10 కోట్లు మంజూరు చేస్తున్నామని... ఇల్లెందు నియోజకవర్గానికి 6 కోట్లు మంజూరు చేస్తున్నామని... అందులో రూ.1 కోటి బయ్యారానికి మంజూరు చేస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.