కేసీఆర్ నినాదం బార్ బడావో.. బార్ బచావో: లక్ష్మణ్

కేసీఆర్ నినాదం బార్ బడావో.. బార్ బచావో: లక్ష్మణ్

లిక్కర్ కు వ్యతిరేకంగా బీజేపీ దీక్ష..
బ్రాంబ్ హైదరాబాద్ ను బార్ హైదరాబాద్ చేశారు..
లిక్కర్ తో నేరాలు ఎక్కువైనా పట్టించుకుంటలేదు..

లిక్కర్ పై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండాలని దీక్ష చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్. గురువారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద దీక్షచేస్తున్న ఆయన… రాష్ట్రంలో లిక్కర్ ఏరులైపారుతున్నా ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పారు. పలు నేరాలకు మద్యమే ముఖ్యకారమని అన్నారు. లక్ష్మణ్ తోపాటు బీజేపీ నాయకురాలు డీకే.అరుణ దీక్షలో పాల్గొన్నారు. వీరితో పాటు బాదితకుటుంబాలు కూడా దీక్షకు హాజరయ్యాయి. మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్… బ్రాండ్ హైదరాబాద్ ను బ్రాండీ హైదరాబాద్ గా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే చెందుతుందని అన్నారు. ట్విటర్ లో పిట్ట కేటీఆర్ మాత్రం గొప్పలకు పోతాడని చెప్పారు.

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఆదాయంకోసం  లిక్కర్ ను ఏరులైపారిస్తున్నారని అన్నారు లక్ష్మణ్. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చిన ఘనట కేసీఆర్ కు చెందుతుందని అన్నారు. మద్యనియంత్రణ శాఖను.. మద్యాన్ని పెంచే శాఖగా మార్చారని ఆయన వెక్కిరించారు. రాష్ట్ర ఆదాయం 80వేల కోట్ల రూపాయల రాబడి ఉంటే.. 20వేల కోట్లు మద్యం అమ్మకంద్వారా రాబడుతోందని ఆయన చెప్పారు. మనది గాని పబ్ కల్చర్ ను ప్రజలనెత్తిన రుద్దుతున్నారని అన్నారు. లిక్కర్ ద్వారా ఎన్ని నేరాలు జరిగినా ప్రజలకు చీమకుట్టకుండా లేదని చెప్పారు. బీజేపీ బేటీ బచావో.. బేటీ పడావో అంటే… కేసీఆర్ మాత్రం బార్ బచావో బార్ బడావో అని అంటున్నరని అన్నారు