ప్రజలకు బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్

ప్రజలకు బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్  గౌడ్
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ 

చెన్నూరు, వెలుగు: టిజేబీకేఎస్ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు గానూ తెలంగాణ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​క్షమాపణ చెప్పాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. చెన్నూరులో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్​తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రవాదాన్ని, గుండాయిజాన్ని పెంపొందించేలా ఉన్నాయని అన్నారు. వందేభారత్, బుల్లెట్​రైళ్లతో కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసే  ప్రయత్నం చేస్తుంటే.. బాల్క సుమన్ మాత్రం రైల్వే ట్రాక్​లు, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయండని పిలుపునివ్వడం రౌడీయిజానికి నిదర్శనమన్నారు. 

రైతులు తమ వద్దకు రావడం లేదని, తాము చేసే ఉద్యమాల్లో పాల్గొనడం లేదని అసహనం వ్యక్తం చేస్తూ తమ పార్టీ కార్యకర్తలకు మిలిటెంట్ ఉద్యమం చేయాలని పిలుపునివ్వడం అసాంఘిక శక్తులను ప్రోత్సహించడమే అవుతుందని అన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీనియర్ నేత రాపర్తి వెంకటేశ్వర్, కౌన్సిలర్ గర్రెపల్లి, శాంతా వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.