
నస్పూర్, వెలుగు: అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అర్హులైన పేదలకు రాజీవ్ వికాసం ఇవ్వాలని, సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా, పాన్ కార్డుని పరిగణలోకి తీసుకోకుండా ఆర్థికంగా ఇబ్బందులున్న అర్హులకు రాజీవ్ వికాసం ఇవ్వాలన్నారు.
ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కేవలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను మాత్రమే లిస్టులో చేర్చి వారికే ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నేతలు పురుషోత్తం, వెంకటకృష్ణ, డి.అశోక్, అశోక్ వర్ధన్, ఎ.కృష్ణమూర్తి, జీవీ ఆనంద్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ శ్రీరాంపూర్ డివిజన్ కమిటీ ఎన్నిక
బీజేపీ శ్రీరాంపూర్ డివిజన్ కమిటీని జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ సోమవారం ప్రకటించారు. నస్పూర్ ప్రెస్ క్లబ్ లో సమావేశంలో ఏర్పాటు చేశాడు. మూడు మండలాలతో కార్పొరేషన్ ఏర్పడగా నాలుగు జోన్లుగా విభజించి కమిటీలను ప్రకటించారు. శ్రీరాంపూర్ జోన్ ప్రధాన కార్యదర్శులుగా పోన్నవేని సదయ్య, బద్రి శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా కట్కూరి తిరుపతి, కట్కూరి సతీశ్, రాచకొండ సత్యనారాయణ, పుల్కా జయమ్మ, కార్యదర్శులుగా డి.సుప్రజ, మాకోటి మల్లేశ్, కర్ణ ప్రదీప్, కొంతం మహేందర్, కోశాధికారిగా రాజేందర్ తో పాటు మరో 35 మందిని సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు.