పేపర్ లీకేజీపై విచారణ కమిటీని ఏర్పాటు చేసిన బీజేపీ

పేపర్ లీకేజీపై విచారణ కమిటీని ఏర్పాటు చేసిన బీజేపీ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహరంపై బీజేపీ పార్టీ సైతం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ టీఎస్పీఎస్సీ సభ్యుడు కే విఠల్ ఆధ్వర్యంలో ఈ కమిటీని నియమించారు. కమిటీలో సభ్యులుగా పార్టీ చెందిన నేతలు బూర నర్సయ్య గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి, రామచందర్ రావు, చంద్రవదన్, కృష్ణ ప్రసాద్, ఎ ప్రసాద్ లు ఉన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో వాస్తవాలు గుర్తించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారిని ఆదేశించారు.

కాగా,ఈ కేసులో మార్చి 15న టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సిట్ అధికారులు గంటపాటు విచారించారు. కార్యాలయంలోని కాన్ఫిడెన్సియల్ సిస్టం ఉన్న గదిని, ప్రవీణ్, రాజశేఖర్ లు పని చేసిన ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. కాన్ఫిడెన్సియల్ సిస్టం ఇంఛార్జ్ ప్రసన్న లక్ష్మి నుంచి వివరాలు తెలుసుకున్నారు సిట్ అధికారులు. సిట్ నివేదిక ఆధారంగా AE పరీక్షపై tspsc నిర్ణయం తీసుకోనున్నది. ఈ విచారణలో క్రైమ్స్ అడిషనల్ సీపీ, సిట్ చీఫ్ ఏ ఆర్ శ్రీనివాస్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ పాల్గొన్నారు.