JP Nadda : నడ్డా పదవీకాలం పొడిగింపు

JP Nadda : నడ్డా పదవీకాలం  పొడిగింపు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలన్ని పొడిగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికల వరకు నడ్డా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నడ్డా అధ్యక్షతనే 2024 ఎన్నికల్లో పోటీకి వెళ్తామని స్పష్టం చేశారు.  ఈ నెల 20న నడ్డా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయం మేరకు నడ్డా 2024 జూన్ వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.