బెంగాల్‌‌‌‌ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌‌‌‌

బెంగాల్‌‌‌‌ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌‌‌‌

రేపు కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌ షా నేతృత్వంలో మీటింగ్‌

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–మే నెలల్లో బెంగాల్‌‌‌‌‌‌‌‌లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దృష్టిపెట్టింది. బెంగాల్‌‌‌‌‌‌‌‌లో విజయం సాధించేందుకు మిషన్‌‌‌‌‌‌‌‌ బెంగాల్‌‌‌‌‌‌‌‌ పేరుతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనిలో భాగంగానే బీజేపీ మంత్రులతో హోం మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమిత్‌‌‌‌‌‌‌‌ షా శనివారం భేటీ కానున్నారు. యూనియన్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్లు, డిప్యూటీ సీఎం, సెంట్రల్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఒక్కొక్కరికీ ఆరు నుంచి ఏడు లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ సీఎం కేశవ్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ మౌర్య, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ కేబినెట్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరోత్తమ్‌‌‌‌‌‌‌‌ మిశ్రాకు కూడా బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు తెలిపాయి.  బీజేపీ నేతలు గజేంద్ర షెకావత్‌‌‌‌‌‌‌‌, సంజీవ్‌‌‌‌‌‌‌‌ బల్యాన్‌‌‌‌‌‌‌‌, ప్రహ్లాద్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, అర్జున్‌‌‌‌‌‌‌‌ ముండా, మన్‌‌‌‌‌‌‌‌సుఖ్‌‌‌‌‌‌‌‌ మాండవియాలు త్వరలో బెంగాల్‌‌‌‌‌‌‌‌ చేరుకుంటారని.. అమిత్‌‌‌‌‌‌‌‌ షా ఈ వారాంతానికి రాష్ట్రానికి వెళతారన్నారు.

బెంగాల్‌‌‌‌‌‌‌‌కు ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ టీం

బెంగాల్‌‌‌‌‌‌‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ టీం పర్యటనకు వచ్చింది. ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌ జరిపేందుకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించేందుకు డిప్యూటీ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుదీప్‌‌‌‌‌‌‌‌ జైన్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని టీమ్‌‌‌‌‌‌‌‌ గురువారం కోల్‌‌‌‌‌‌‌‌కతా చేరుకుంది. సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌, కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో ఈ బృందం భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ నేషనల్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జేపీ నడ్డా కాన్వాయ్‌‌‌‌‌‌‌‌పై దాడి, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై  రాష్ట్ర హోం శాఖ, ఆరోగ్య శాఖ సెక్రెటరీలతో చర్చించనుంది. పోలింగ్‌‌‌‌‌‌‌‌ బూత్‌‌‌‌‌‌‌‌లలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై కూడా చర్చిస్తుంది అని అధికారులు చెప్పారు.

కేంద్రానికి తలొంచేది లేదు: మమత

కోల్‌‌‌‌‌‌‌‌కతా: కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్‌‌‌‌‌‌‌‌ సీఎం మమతామరోసారి ఫైరయ్యారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన ముగ్గురు సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఎస్‌‌లను డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌పై కేంద్రానికి రావాలని పిలిపించడంపై స్పందించారు. బెంగాల్‌‌‌‌‌‌‌‌లో అధికారులను నిరుత్సాహపరిచేందుకు, రాష్ట్ర అధికార పరిధిని అతిక్రమించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని, ఏదిఏమైనా కేంద్రానికి తలొంచేది లేదని మమత స్పష్టం చేశారు. ‘ఎన్నికలకు ముందు కేంద్రం చేస్తున్న ఈ పనులు ఫెడరల్‌‌‌‌‌‌‌‌ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విరుద్ధం. రాజ్యాంగం వీటిని ఆమోదించదు. ఇది కేంద్రం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం.’ అని వరుస ట్వీట్లలో మమత కామెంట్స్‌‌‌‌‌‌‌‌ చేశారు.

For More News..

సిటీని బ్లాక్‌ చేస్తే ఎట్ల? రైతులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

రాష్ట్రంలోనే ఫెయిలయిన కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలా?

లోపాలు సరిచేయకపోతే ధరణి పోర్టల్‌తో​ లీగల్ సమస్యలు