ఓట్లు పడేంతవరకే రైతుబంధు…

ఓట్లు పడేంతవరకే రైతుబంధు…

వరంగల్ అర్బన్:  ఓట్లు పడేవరకు రైతు బంధు ఇచ్చి, ఆ తర్వాత ఇవ్వకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని బీజేపీ జాతీయనేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 104 వ జయంతి సందర్భంగా శుక్రవారం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రసేనా మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఆయన అన్నారు.  ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా  ఆ మహనీయుడిని ప్రభుత్వం గుర్తు పెట్టుకోలేదని ఇంద్రసేన అన్నారు. 1956,1969 లో పోరాడిన వారు,అసువులు బాసిన వారి పేర్లు కూడా సీఎం కేసీఆర్ స్మరించకుండా ఉన్నారని అన్నారు. కేసీఆర్ తన కుటుంబం గూర్చి తప్ప ప్రజల గూర్చి మాట్లాడడం లేదని అన్నారు.

ప్రస్తుతం ఎన్నికల కోసమే సూర్యాపేట జిల్లాలోని రైతులకు రైతుబందు డబ్బులు ఇస్తున్నారని ఇంద్రసేనా అన్నారు. యూరియా కొనుగోలు కోసం కేటాయించిన నిధులు ఎన్నికలకు మళ్లించారన్నారు. మే, జూన్ మాసం వరకే రైతులకు ఎరువులను సిద్ధం చేయాల్సిన ప్రభుత్వం ఆ చర్యలు పట్టించుకోకుండా, యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో నిల్చోవాల్సిన పరిస్థితి తెచ్చిందన్నారు. యూరియా కోసం లైన్ లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన రైతు ప్రాణం ప్రభుత్వ హత్యేనని ఆయన అన్నారు. వ్యాపారులకు లాభం చేకూరేలా పనిచేస్తున్న ఈ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమాలు చేస్తామని ఇంద్రసేనా అన్నారు.

BJP Former state president IndraSena Reddy comments on CM KCR