అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోండి.. లేదంటే అధికారం నుంచి దిగిపోండి

అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోండి.. లేదంటే అధికారం నుంచి దిగిపోండి

కోల్‌‌కతా: కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ చట్టాలు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని, వీటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ఈ చట్టాలను ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వం పవర్ నుంచి దిగిపోవాలన్నారు. వెస్ట్‌‌ మిడ్నాపూర్ జిల్లాలో నిర్వహించిన టీఎంసీ పార్టీ ర్యాలీలో ఆమె పైవ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి. లేదంటే ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలి. రైతుల హక్కులను త్యాగం చేసిన గవర్నమెంట్‌‌కు అధికారంలో ఉండే హక్కు లేదు’ అని మమత పేర్కొన్నారు. బెంగాల్‌‌లో బీజేపీ విస్తరించడానికి తాము అవకాశం ఇవ్వబోమన్నారు. అవతలి పార్టీ వచ్చి తమ రాష్ట్రాన్ని నియంత్రిస్తామంటే ఊరుకోబోమని వివరించారు.