ప్రజా విశ్వాసాన్ని బీజేపీ కోల్పోయింది: ప్రియాంక

ప్రజా విశ్వాసాన్ని బీజేపీ కోల్పోయింది: ప్రియాంక

మధుబని: దేశవ్యాప్తంగా ప్రజా విశ్వాసాన్ని బీజేపీ కోల్పోయిందని, అందుకే ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్  సీనియర్  లీడర్  ప్రియాంకా వాద్రా గాంధీ ‘ఎక్స్’ లో అన్నారు. ఇకపై ఓట్ల చోరీ జరగనివ్వబోమన్నారు. బిహార్ లో చేపడుతున్న ఓటరు సవరణ ప్రక్రియ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఆమె తీవ్రంగా  మండిపడ్డారు. బిహార్ లో బీజేపీ, జేడీయూ సర్కారు అన్ని అంశాల్లోనూ ఫెయిలైందని విమర్శించారు. కాగా..  సుపౌల్ లో ఓటర్  అధికార్ యాత్రలో రాహుల్  గాంధీతో ఆమె కూడా పాల్గొన్నారు.