V6 News

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్

దిస్‎పూర్: అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 88 నుంచి 100  సీట్లు గెలిచి మూడోసారి కాషాయ పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందని మెజార్టీ ఎగ్జిట్ అంచనాలు వెల్లడించాయి. 2026, ఏప్రిల్ 29న వెస్ట్ బెంగాల్‎లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పలు సర్వే సంస్థలు, మీడియా ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి. ఇందులో భాగంగానే అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 88 నుంచి 100  సీట్లతో కమలం పార్టీ ల్యాండ్ స్లైట్ విక్టరీ సాధిస్తుందని వెల్లడించాయి. కాంగ్రెస్ 24 నుంచి 36 సీట్లకే పరిమితమై మరోసారి ప్రతిపక్షంలో ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

అస్సాంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 124
మ్యాజిక్ ఫిగర్: 64 సీట్లు

యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్:

బీజేపీ= 88-100 సీట్లు
కాంగ్రెస్= 24-36 సీట్లు
ఇతరులు= 0

మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్:

బీజేపీ= 85 నుంచి 95 సీట్లు
కాంగ్రెస్‌= 25 నుంచి 32 సీట్లు
ఇతరులు= 0