జాతీయ అధ్యక్షుడి వేటలో బీజేపీ.. ఇప్పటికే వంద మందిలీడర్లతో సంప్రదింపులు

జాతీయ అధ్యక్షుడి వేటలో బీజేపీ..  ఇప్పటికే వంద మందిలీడర్లతో సంప్రదింపులు

న్యూఢిల్లీ: త్వరలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. బిహార్  అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నది. కొత్త ప్రెసిడెంట్  నాయకత్వంలో బిహార్  ఎన్నికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త అధ్యక్షుడి కోసం ఇప్పటికే 100 మందితో సంప్రదింపులు జరిపారు. 

పార్టీ సీనియర్  నేతలతో పాటు ఆరెస్సెస్ లో కీలక లీడర్లు,  కేంద్ర మంత్రులతో కొత్త అధ్యక్షుడిపై చర్చలు జరిపారు. కాగా.. వివిధ కారణాల అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ఆలస్యమైందని బీజేపీ వర్గాలు తెలిపాయి. జగ్ దీప్  ధన్ ఖడ్ రాజీనామా నేపథ్యంలో వచ్చే నెల 9న ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు. 

అలాగే, గుజరాత్, యూపీ, కర్నాటక, హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్, పంజాబ్, మణిపూర్  వంటి యూనిట్లకు పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సి ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటే బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. దాని 36 స్టేట్, యూనియర్  టెరిటరీల్లో కనీసం 19 యూనిట్లకు అధ్యక్షులు ఉండాలి. గత నెలలోనే 28 రాష్ట్రాల్లో అధ్యక్షులను ఎంపిక చేశారు.