మేయర్, డిప్యూటీ మేయర్ బరిలో బీజేపీ

మేయర్, డిప్యూటీ మేయర్ బరిలో బీజేపీ

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్​ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో బీజేపీ 48 సీట్లు గెల్చుకున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త కార్పొరేటర్లలో ఒకరు చనిపోవడంతో ఈ సంఖ్య 47కు తగ్గింది. ఎక్స్​అఫీషియో మెంబర్ల సంఖ్య కూడా తక్కువగా ఉంది. దీంతో బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేందుకు సరిపడా బలం లేకుండా పోయింది. అయితే ఎవరికీ సపోర్ట్​ చెయ్యకుండా ఉండటం, ఎన్నికలను బహిష్కరించడం వంటివి చేస్తే.. జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పోటీలో ఉండేందుకే మొగ్గు చూపింది. మంగళవారం పార్టీ సీనియర్ నేతలు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జీహెచ్ఎంసీ పరిధి ఉన్న ఆరు జిల్లాల పార్టీ చీఫ్​లు మీటింగ్​లో పాల్గొన్నారు. తమ ఓట్లను తామే వేసుకోవాలనే ఉద్దేశంతో పోటీకి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ తోపాటు విప్ పదవికి ఎవరి పేర్లను ఖరారు చేయాలో బుధవారం  సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు బుధవారం పొద్దున 8.30 గంటలకు స్టేట్ ఆఫీసులో పార్టీ కార్పొరేటర్లతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల వైఖరేంటో తెలుసుకునేందుకే.. తాము బరిలో నిలవాలని నిర్ణయించినట్టు బీజేపీ నేత ఒకరు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు..?

షర్మిల..జగన్ అన్న వదిలిన బాణం కాదు,కేసీఆర్ వదిలిన బాణం

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా

జగన్ వద్దన్నా షర్మిల వినలే.. ఆమె పార్టీతో వైసీపీకి సంబంధం లేదు