
బషీర్బాగ్, వెలుగు: దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు ప్రధాన పాత్ర పోషిస్తే.. ప్రస్తుత కేంద్ర పాలకులు ఈ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఎంఐఎం పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బ్రిటీషర్స్కు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలను త్యాగం చేసిన ముస్లింల చరిత్రను తెలుపకపోవడం బాధాకరమన్నారు. నేతాజీకి ముఖ్య అనుచరుడు, ‘జైహింద్’ అనే నినాదం ఇచ్చిన హైదరాబాదీ హబీద్ హాసన్ సత్రానీని పాలకులు గుర్తించకపోవడం బాధాకరమన్నారు.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఇస్టారికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ‘ఆన్ వెఫ్ట్ అండ్ ఆన్ సంగ్ హీరోస్ ఆఫ్ తెలంగాణ’పై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ మాట్లాడారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి.. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చెన్నారెడ్డి పాల్గొన్నారు.