హైదరాబాద్: బంజారాలు హిందూ సమాజం కోసం పాటు పడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గొప్పవ్యక్తుల స్పూర్తితో బంజారాలు ముందుకు వెళ్తున్నారని..ఠాను నాయక్ నిజాం నిరంకుశ పాలనలో వీరోచిత పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. బుధవారం ఠాను నాయక్ 108 జయంతి ఉత్సవాలను బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. పేద ప్రజల కోసం పని చేసిన ఠాను నాయక్..పేదలకు భూములు పంచాడన్నారు. ఒక లక్ష్యం కోసం పని చేసిన, స్ఫూర్తి దాయకమైన వ్యక్తి ఠాను నాయక్..వారు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకోవడం అవసరమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం బంజారాలు తమ వంతు పోరాటం చేశారని..కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంజారాలను పట్టించుకోవడం లేదన్నారు. STలకు రిజర్వేషన్లను పెంచుతామని సీఎం కేసీఆర్ దొంగ మాటలు చెప్పారన్నారు. కేంద్రానికి ప్రత్యేకంగా రిజర్వేషన్ల అంశాన్ని పంపితే, కేంద్రం కూడా పరిశీలిస్తోందని తెలిపారు సంజయ్. కాంగ్రెస్ పార్టీ కూడా గిరిజనులను వంచించిందన్న ఆయన..గిరిజనులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. సమస్యలపై పోరాటం చేస్తుందని చెప్పారు బండి సంజయ్.

