ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ.. కార్మికులను భయపెడుతున్న కేసీఆర్

ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ.. కార్మికులను భయపెడుతున్న కేసీఆర్

హైకోర్టు ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసినా పట్టించుకోవడం లేదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ‘గవర్నర్ జోక్యం చేసుకుని అధికారులను పిలిపించుకుని మాట్లాడినా కెసిఆర్ కు సోయి లేదు. ఎంపీ సంజయ్ పైన పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. తమ బాధ్యత విస్మరించి తోత్తులుగా మారారు. హిందూ ఆచారాలకు విరుద్ధంగా మఫ్టీలో పోలీసులు శవాన్ని ఎత్తుకెళ్లారు. డెంగీ జ్వరాలు విజృంభిస్తున్న పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. రైతు బంధు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి మర్చిపోయారు. కేసీఆర్ ప్రభుత్వం ఎలక్షన్ కలెక్షన్ గా మారింది.

కోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చి అధికారులు బలవుతున్నారు. కేంద్రం ఆమోదించిన మోటారు వాహనాల చట్టాన్ని అమలు చేయనని అసెంబ్లీలో చెప్పిన కెసిఆర్,  ఇప్పుడు ఎలా అమలు చేస్తానని అంటున్నారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేస్తామని కార్మికులను భయపెడుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, మాకు అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్. ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం కాదు. అయితే అది సంస్థకు లాభం జరగాలి’. అని తెలిపారు లక్ష్మణ్.