అగ్రి చట్టాలపై టీఆర్​ఎస్​ అబద్ధాలను రైతులు నమ్మరు

అగ్రి చట్టాలపై టీఆర్​ఎస్​ అబద్ధాలను రైతులు నమ్మరు

‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై టీఆర్ఎస్ అబద్ధాలను ప్రచారం చేస్తోంది. మార్కెట్​ యార్డులను ఎత్తేస్తారంటూ రైతులను పక్కదారి పట్టిస్తోంది. మద్దతు ధరతోపాటు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే హక్కు ఈ చట్టాలతో రైతులకు దక్కింది. మార్కెట్ యార్డులను ఎత్తేస్తున్నట్లు చట్టంలో లేదు. టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా గులాబీ వలలో తెలంగాణ రైతులు పడరు”అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన ఆయన వీ6–వెలుగుకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

అగ్రి చట్టాలపై నిరసనలకు కారణం ఏమిటి?

రకరకాల పన్నుల రూపంలో తెలంగాణ రైతులు మార్కెట్ యార్డులకు ఏటా దాదాపు రూ.400 కోట్లు కడుతున్నారు. ఈ డబ్బుల్ని రైతుల కోసం ఉపయోగించకుండా.. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లు, సభ్యులుగా ఉన్న అధికార పార్టీ నేతలు, దళారీలతో కలిసి దోచుకుంటున్నారు. తమ ఆదాయానికి గండిపడుతుందనే భయంతోనే ఈ చట్టాలకు టీఆర్ఎస్ అడ్డుచెబుతోంది.

ఈ చట్టాలపై రైతులకు ఏం చెబుతారు?

అగ్రి చట్టాలపై టీఆర్ఎస్ అబద్ధాలను ప్రచారం చేస్తోంది. రైతులకు నష్టం జరుగుతుందని, మార్కెట్​ యార్డులను ఎత్తేస్తారంటూ పక్కదారి పట్టిస్తోంది. మార్కెట్ యార్డులను ఎత్తేస్తున్నారనే మాట చట్టంలో లేదు. మద్దతు ధరతోపాటు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే హక్కు ఈ చట్టాలతో రైతులకు దక్కింది. టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా గులాబీ వలలో తెలంగాణ రైతులు పడరు. దోపిడీకి అడ్డుకట్ట వేయడంతోపాటు రైతుల బాగు కోసమే ప్రధాని మోడీ ఈ వ్యవసాయ సంస్కరణలను తీసుకొచ్చారు. రైతు సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి.. ఈ చట్టాల వల్ల కలిగే మేలును తెలియజేస్తాం.

ఓబీసీల గురించి ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి?

70 ఏండ్లుగా కాంగ్రెస్ ఓబీసీలను మోసం చేసింది. వారిని ఓట్లుగా మాత్రమే చూసిందే తప్ప.. విద్యా, ఉద్యోగం, పాలనా రిజర్వేషన్లలో అవకాశం కల్పించలేదు. బీసీ వర్గం నుంచి ప్రధాని అయిన మోడీ రెండు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీల అభ్యున్నతి కోసం జాతీయ బీసీ కమిషన్ ను ఏర్పాటు చేశారు. బీసీల్లో అణగారిన వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో జస్టిస్ రోహిణి నేతృత్వంలో కమిటీ వేశారు. ఈ కమిటీ 2021 జనవరిలోపు ప్రభుత్వానికి రిపోర్ట్​ సమర్పించనుంది. ఓబీసీల అభ్యున్నతి కోసం కేంద్రం ఇప్పటికే 100కుపైగా పథకాలను తీసుకువచ్చింది. ఈ పథకాల గురించి పేదలకు వివరిస్తాం.

దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎలక్షన్స్​లో విజయం ఎవరిది?

ఎమ్మెల్సీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుంది.

బీహార్ ఎన్నికల్లో వ్యూహం ఏమిటి?

బీహార్ ఎన్నికల్లో ఓబీసీ లను పార్టీకి చేరువ చేసే బాధ్యతను పార్టీ హైకమాండ్​ నాపై పెట్టింది. ఢిల్లీ టూర్​లో ఇదే అంశంపై పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపాను. పాట్నాతోపాటు ఇతర ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటా. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, ఎల్‌‌జేపీ, హెచ్ఎంఎస్ కూటమే విజయం సాధిస్తుంది.

మీ టార్గెట్​ ఏమిటీ? ఏఏ రాష్ట్రాలపై దృష్టి పెడతారు?

సారు.. కారు… 16 నినాదంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ ను సింగిల్ డిజిట్ కే పరిమితం చేయడంలో స్టేట్ ప్రెసిడెంట్ గా సక్సెస్ అయ్యా. నా సేవల్ని గుర్తించిన హైకమాండ్​ జాతీయ కార్యవర్గంలో  చోటు కల్పించింది. దేశంలో 50 శాతానికిపైగా ఉన్న బడుగు, బలహీన వర్గాలను సంఘటితం చేయడంతో పాటు, వారిని బీజేపీకి దగ్గర చేయడమే నా టార్గెట్. ఇందుకోసం గ్రామ స్థాయి నుంచి ప్రణాళిక రూపొందిస్తున్నాను. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలే నా ఫస్ట్​ టార్గెట్.

For More News..

కరోనా వస్తే దీదీని హగ్​ చేసుకుంటానన్నబీజేపీ నేతకు పాజిటివ్

మంత్రాలు చేస్తోందనే డౌట్​తో తల వేరు చేసిన్రు.. అడ్డొచ్చిందని టీచర్‌నూ చంపిన్రు

సోనీ నుంచి వైర్​లెస్​ హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌