మేడారం జాతరలో కనీస ఏర్పాట్లు చేయలేదు…

మేడారం జాతరలో కనీస ఏర్పాట్లు చేయలేదు…

మేడారం జాతరకు కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేస్తామన్న సీఎం కేసీఆర్ కనీస ఏర్పాట్లను కూడా కల్పించలేదని అన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్. గురువారం పొద్దున అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారంకు బయలుదేరారు.  మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రకృతితో ముడిపడిన ఆదీవాసీల జాతర మేడారం జాతర అని అన్నారు. ఇందులో కోట్లాదిమంది భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటారని… ఇలాంటి ఘనమైన జాతరకు ఏర్పాట్లు అంతంత మాత్రమే చేశారని తెలిపారు. జంపన్న వాగుపై చెక్ డ్యాం కడతామన్న కేసీఆర్ ఇప్పటికీ కట్టలేదని అన్నారు.

గతంలో జాతరకు వెళ్లిన సీఎం కేసీఆర్ కుర్చీవేసుకుని కూర్చుని మరీ.. 200కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామన్నారని తెలిపారు. ఇందుకు విరుద్ధంగా ప్రస్తుతం…  మేడారం జాతర నిధులను అధికారపార్టీ నేతలు మాయంచేశారని అన్నారు. నిధులను మింగడానికే నలుగురు కలెక్టర్లను మార్చారని చెప్పారు. ప్రజలందరూ బాగుండాలని బంగారం మొక్కును అమ్మావార్లకు సమర్పిస్తున్నామని అన్నారు లక్ష్మణ్.

మరిన్ని వార్తలు

కరోనా ఎఫెక్ట్: భారత్ లో మూతపడుతున్న చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు
కొత్త కార్లతో జిల్‌‌జిగేల్…
కోఆపరేటివ్ బ్యాంకులకు కొత్త రూల్స్
ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేనేజర్ తో లేనని చెప్పించా
లాస్ ఏంజిలిస్​లో మోసగాళ్లు
తెలంగాణ నుంచే ‘టాటా’కు ఎక్కువ ఆదాయం