అవినీతి రారాజు సీఎం కేసీఆర్.. బీజేపీ నేత

అవినీతి రారాజు సీఎం కేసీఆర్.. బీజేపీ నేత

నిర్మల్, వెలుగు:  సీఎం  కేసీఆర్ అవినీతి, అక్రమాలకు రారాజుగా మారిపోయారని, వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్లమెంట్ ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ ఆరోపించారు.  శుక్రవారం బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.  బీజేపీ  జిల్లా అధ్యక్షురాలు రమాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ..  ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిది సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా మహాజన సంపర్క్ అభియాన్ పేరిట నెల రోజుల పాటు గ్రామాల్లో బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.  

మాజీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి రాజకీ య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా కార్యవర్గ సభ్యులందరూ ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో డీ వన్ పట్టాల పేరు తో అవినీతి పేరుకుపోయిందని ఆరోపించారు.  జిల్లా సహాయ ఇన్ చార్జి మేన మహేష్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి  భూమయ్య, ప్రధాన కార్యదర్శులు మేడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్రెడ్డి, పడిపల్లి గంగాధర్, డాక్టర్ మల్లికార్జున్​ రెడ్డి, రామారావు పటేల్, మోహన్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.