Smriti Irani: సీరియల్స్లోకి మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రీఎంట్రీ.. జెడ్+ సెక్యూరిటీ మధ్య షూటింగ్ !

Smriti Irani: సీరియల్స్లోకి మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రీఎంట్రీ.. జెడ్+ సెక్యూరిటీ మధ్య షూటింగ్ !

బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్నారు. రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ సీరియల్లో నటించేందుకు సెట్స్కు వెళ్లారు. ‘‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’’ సీజన్ 2లో ఆమె నటిస్తున్నారు. సీరియల్ షూటింగ్లో నటిస్తున్న ఆమెకు జెడ్+ భద్రత కల్పించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంతేకాదు.. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మధ్య ఈ సీరియల్ షూటింగ్ జరిగినట్లు తెలిసింది.

స్మృతి ఇరానీ షూటింగ్లో ఉన్నంతసేపు సీరియల్ సెట్స్లో ఉన్న ప్రతీ ఒక్కరి మొబైల్ ఫోన్లను ఆమె భద్రతా సిబ్బంది తీసేసుకున్నట్లు సమాచారం. ఎవరూ ఫోన్లను ఉపయోగించడానికి వీలు లేకుండా చేశారు. ఆమె షూటింగ్ నుంచి వెళ్లిపోగానే ఎవరి మొబైల్ ఫోన్లను వాళ్లకు ఇచ్చేశారు.

రాజకీయాల్లోకి రాకముందు స్మృతి సీరియల్ నటి అనే సంగతి తెలిసిందే. Kyunki Saas Bhi Kabhi Bahu Thi సీరియల్ అప్పట్లో స్మృతి ఇరానీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2000 సంవత్సరం నుంచి 2008 వరకూ ప్రసారమైన ఈ సీరియల్తో తుల్సీగా ఆమె సీరియల్ వీక్షకులకు సుపరిచితురాలు. దాదాపు 1850 ఎపిసోడ్ల వరకూ ఈ సీరియల్ ప్రసారమైంది. ఇప్పుడు ఈ సీరియల్ సెకండ్ సీజన్ను ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకులకు అందించాలని నిర్మాత ఏక్తా కపూర్ భావించారు.

2008లో అర్థాంతరంగా ముగిసిన ఈ సీరియల్ను 2 వేల ఎపిసోడ్స్ మైలురాయిని చేర్చాలని ఏక్తా కపూర్ డిసైడ్ అయ్యారు. ఆ అరుదైన ఘనతకు 150 ఎపిసోడ్స్ దూరంలో ఈ సీరియల్ నిలిచింది. 2003లో స్మృతి ఇరానీ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రిగా కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె మళ్లీ యాక్టింగ్ ప్రొఫెషన్కు కమ్ బ్యాచ్ ఇచ్చారు.