బీఆర్ఎస్ కౌన్సిలర్ కార్యాలయంపై బీజేపీ నేత దాడి

బీఆర్ఎస్ కౌన్సిలర్ కార్యాలయంపై బీజేపీ నేత దాడి

ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి బొక్కోనిగూడ 3వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బొక్క సంగీతా ప్రభాకర్ రెడ్డి కార్యాలయంపై బీజేపీ నేత కొమ్మిడి మహిపాల్ రెడ్డి దాడి చేశారు.ఈ దాడిలో ఆఫీసు అద్దాలు, ఇతర ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సిఐ,ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. 

అడ్డువచ్చిన తనను పక్కకు నెట్టేసి.. తన భర్త ప్రభాకర్ రెడ్డిని చంపేస్తానని భయబ్రాంతులకు గురి చేశాడని కౌన్సిలర్ సంగీత తెలిపారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగడం సిగ్గు చేటని ఆమె అన్నారు. మహిపాల్ రెడ్డి నుండి తమకు ప్రాణహని ఉన్నదని తమకు రక్షణ కల్పించాలని సంగీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.