ద్వాక్రా మహిళలకే చీరలా.. మిగతా వారికి వద్దా? : బండ కార్తీక రెడ్డి

ద్వాక్రా మహిళలకే చీరలా.. మిగతా వారికి వద్దా? : బండ కార్తీక రెడ్డి
  • తెల్ల రేషన్‌‌‌‌ కార్డు ఉన్న ప్రతి మహిళకు చీరలు ఇవ్వాలి: బండ కార్తీక రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ పండుగ సందర్భంగా కేవలం డ్వాక్రా మహిళలకే బతుకమ్మ చీరలు పంపిణీ చేసి, మిగిలిన వారిని పట్టించుకోకపోవడం సరికాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి అన్నారు. గతంలో 18 ఏండ్లు పైబడిన ప్రతి మహిళకు చీర ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ మాట తప్పిందని మండిపడ్డారు. 

శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కోటి 30 లక్షల మంది అర్హులైన మహిళలు ఉన్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 65 లక్షల మందికి మాత్రమే చీరలు పంపిణీ చేస్తామనడం ఏంటని ప్రశ్నించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రెండు చీరలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చీరల పంపిణీకి ‘ఇందిరా మహిళా శక్తి’అని పేరు పెట్టడం సరికాదన్నారు.