ఫ్రస్టేషన్ సీఎం ఏం మాట్లాడుతున్నారో ?

ఫ్రస్టేషన్ సీఎం ఏం మాట్లాడుతున్నారో ?

నరేంద్ర మోదీని తిట్టడానికే కేసీఆర్ మీటింగ్ పెట్టాడన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఫ్రస్ట్రేషన్ సీఎం కేసీఆర్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం అవ్వడం లేదన్నారు. బియ్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేయాలని చూసారన్నారు. ఇప్పుడు రైతుల బావుల దగ్గర మీటర్లు పెడతారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. మోటర్లకు మీటర్లు పెడితే నీకేమన్న ఇబ్బంది ఉందా...? అంటూ ప్రశ్నించారు అరుణ. రైతుల ఖాతాలో అడ్వాన్స్ గా డబ్బులు వేస్తే వాళ్లే డిస్కం లకు కట్టుకుంటారన్నారు. రైతుల బిల్లులు చెల్లించాల్సిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. ఒక రాష్ట్రంలో అధికారంలో  ఉన్న నువ్వే ఢిల్లీ కోటలు బద్దలుకొట్టి మోడీని దేశం నుండి తరిమేస్తావా...? ప్రధాన మంత్రిని ఇంత అవమాన కరంగా మాట్లాడుతావా...? అంటూ అరుణ ధ్వజమెత్తారు.

తెలంగాణలో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి అసహనంలో సీఎం మాట్లాడుతున్నారన్నారు. కేవలం హుజురాబాద్ ఎన్నిక కోసమే దళితబంధు పథకం తీసుకొచ్చారని దేశం అంతా తెలుసన్నారు. దళితబంధు పథకం కార్యకర్తల కోసమా.... దళితుల కోసమా అంటూ ప్రశ్నించారు డీకే అరుణ. ప్రజలను మోసం చేసే ఇలాంటి నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక వాటిని అమలు చేయడం లేదన్నారు. పిచ్చి పట్టి మాట్లాడుతున్న సీఎం సైకియాట్రీస్ట్ దగ్గరికి  వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ పులి బిడ్డ కాదు.. పిల్లి బిడ్డ అని విమర్శించారు. 

టీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడితే తప్పులేదు కానీ మేం మాట్లాడితే తప్పా అంటూ ప్రశ్నించారు. ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే పోలీసులు వారికి సహకరిస్తున్నారన్నారు. టీఆరెస్ నాయకులు పోలీసులను చూసి విర్రవీగుతున్నారన్నారు. ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం ఏంటని అరుణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుర్చీ పర్మినెంట్ కాదని ...ఉద్యోగులు ఈ విషయం గమనించాలన్నారు. ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా దానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు అరుణ. 

ఇవి కూడా చదవండి: 

కేసీఆర్ మాటలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది

రేపు అన్ని పోలీస్ స్టేషన్లో సీఎం హిమంత శర్మపై కేసులు