బిడ్డను MPగా గెలిపించుకోలేని KCR ప్రధాని అవ్వాలనుకున్నారు

బిడ్డను MPగా గెలిపించుకోలేని KCR ప్రధాని అవ్వాలనుకున్నారు

మోడీ గెలుపు ఒక గెలుపేనా అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు  మాజీమంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ. జ్యోతిష్యులు చెప్పారని కేసీఆర్ ప్రధాని అయిపోవాలని చూశారని చెప్పారు. అందుకే ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాలన్ని తిరుగుతూ తనను ప్రధానిని చేయాలని ఆయా నాయకులను కోరారని తెలిపారు. దీంతో పాటే ధనాన్నికూడా పలువురు రాష్ట్ర నాయకులకు అందజేశారని అన్నారు. కేసీఆర్ ప్రధాని అవడమేమో కానీ.. ఆయను బిడ్డను కూడా ఎంపీగా గెలిపించుకోలేకపోయారని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తదని.. ప్రజలు కూడా బీజేపీని బలోపేతం చేస్తున్నారని అన్నారు డీకే అరుణ. మోడీ, అమిత్ షాల దృష్టి తెలంగాణ పై ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుంది కాబట్టే పనులు ముందుకెళ్లాయని అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతి బట్టబయలు చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఆదరాబాదరాగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు పోతుందని అన్నారు. కొత్త మున్సిపల్ చట్టం పేరుతో ప్రభుత్వం స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు అరుణ.

మున్సిపాలిటీ కొత్త చట్టం ద్వారా మున్సిపాలిటీ కౌన్సిలర్లకు ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు డీకే అరుణ. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న మున్సిపాలిటీలకే నిధులు ఇవ్వడం లేదని… పెంచిన వాటికి ఏం ఇస్తారని అన్నారు. వర్షాలు లేక పంటలు ఎండి పోతుంటే… కేసీఆర్ కనీసం సమీక్ష కూడా నిర్వహించడం లేదన్నారు డీకే అరుణ. ప్రజల సంక్షేమాన్ని  గాలికి వదిలేశారని అన్నారు. మోడీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుందని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని అణచివేత ధోరణి కొనసాగుతోందని అన్నారు అరుణ.