ఆర్టీసీ ఉద్యోగుల మీద నీ జులుం ఏంటి?

ఆర్టీసీ ఉద్యోగుల మీద నీ జులుం ఏంటి?

సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై చేస్తున్న నియంత పోకడలను మానుకోవాలని బీజేపీ నేత డీకేఅరుణ అన్నారు. సకల జనుల సమ్మె, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఆర్టీసీ కార్మికులు. అప్పుడు ఇచ్చిన హామీలు మర్చిపోయి ఇప్పుడు జులుం ప్రదర్శించడం సరికాదన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని, ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తుంటే తెలంగాణ ఎవరికోసం వచ్చింది..? ప్రజల కోసం వచ్చిందా..? లేదంటే మీకోసం వచ్చిందా..? తెలంగాణ ప్రజలకు ప్రశ్నించే హక్కులేదా..? అని ప్రశ్నించారు డీకేఅరుణ. అధికార దాహంతో ఆర్టీసీ కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. హక్కుల కోసం సమ్మె చేస్తుంటే వారి కుటుంబాల్లో దసరా పండుగ లేకుండా చేశారన్నారు. ఇందుకేనా తెలంగాణ వచ్చింది కేసీఆర్ అని డీకే అరుణ ప్రశ్నించారు.