హుజురాబాద్‌ కేసీఆర్‌‌కు కళ్లు తెరిపించింది

హుజురాబాద్‌ కేసీఆర్‌‌కు కళ్లు తెరిపించింది

కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నిక సెగ బాగా తగిలిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఉప ఎన్నిక  కేసీఆర్ కు కళ్లు తెరిపించిందన్నారు. కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పే సీఎం.. దేశంలో లేరన్నారు.  కేసీఆర్ తెలంగాణ ద్రోహి..దేశ ద్రోహిగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటుంటే..కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారన్నారు. మోడీ పీఎం అయ్యాక శత్రువులు ఇంచుభూమి కూడా ఆక్రమించుకోలేదన్నారు. కేసీఆర్ సైనికులను కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. ఓట్ల కోసం రాష్ట్రంలో రోహింగ్యాలను పెంచిపోషిస్తున్నారన్నారు. మద్యం  షాపులు విస్తరించడంతో కుటుంబాల్లో, గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ ప్రజల రక్తాన్ని పీల్చుకుని..  లిక్కర్ ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నారన్నారు.  24 రాష్ట్రాల్లో పెట్రోల్ పై వ్యాట్ ను తగ్గిస్తే.. తెలంగాణలో ఎందుకు తగ్గించరో చెప్పాలన్నారు. వ్యాట్ తగ్గించే వరకు కేసీఆర్ ను విడిచిపెట్టబోమన్నారు. కేసీఆర్ అహంకార ధోరణితో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ నాయకులంటే కేసీఆర్ కు గౌరవం లేదన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా వ్యాపారుల నుండి కేసీఆర్ దోచుకున్నారన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. ఆ తర్వాత సంపాదించిన ఆస్తులెన్నో కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ ఒక అవినీతి సామ్రాట్ అని.. మోడీ పేరేత్తే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. మోడీ దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. వరి ధాన్యం కొనడం లేదని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్నారు. కేసీఆర్ ధర్నాలు ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదన్నారు.

మోడీని కేసీఆర్ ప్రశ్నిస్తే తప్పులేనిది..తెలంగాణలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే తప్పేంటన్నారు. కేసీఆర్ కు ప్రశ్నించే హక్కు ..ధర్నాలు చేసే హక్కు లేదన్నారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. యాదగిరి గుట్ట పేరును యాదాద్రి అని మార్చారన్నారు. పాత పేర్లు ఏవి  ఉండకూడదని కేసీఆర్ ఉద్దేశమన్నారు. కేసీఆర్ కూడా దుబాయ్ శేఖర్ అని పేరు  మార్చుకోవాలన్నారు.