ఆకలినైనా భరిస్తాం..ఆత్మగౌరవాన్ని వదులుకోం

ఆకలినైనా భరిస్తాం..ఆత్మగౌరవాన్ని వదులుకోం

హైదరాబాద్: తెలంగాణలో ఆట మొదలైందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆకలినైనా భరిస్తాం..ఆత్మ గౌరవాన్ని వదులుకోమన్నారు. విజయోత్సవం ర్యాలీ అనంతరం బీజేపీ స్టేల్ ఆఫీసులో మాట్లాడిన ఈటల..ఈ విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితం అన్నారు. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ చెల్లుమనిపించారని..  ప్రజా స్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారన్నారు. కేసీఆర్ ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా ..పులి బిడ్డల్లాగా ఓట్లేసి గెలిపించారన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే ఎన్నిక అని.. కేసీఆర్ అహంకారాన్ని దించేలా చేశారన్నారు. అధికార, ధన బలంతో .. పోలీసుల ముందే డబ్బులు పంచినా .. ప్రజలు మాత్రం ధర్మం వైపే నిలబడ్డారన్నారు. 

2023లో బీజేపీజెండా ఎగరబోతుందన్నారు. నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని చెప్పారు ఈటల.. ఎన్ని ప్రలోభాలు పెట్టినా..హుజురాబాద్ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోలేదన్నారు.రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు ఈటల రాజేందర్. ప్రజలను బానిసలుగా చేసుకొని పాలనసాగిస్తున్నారని అన్నారు.. హుజురాబాద్ లో గెలిచేందుకు 2,500 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఆ డబ్బంత ఎక్కడి నుంచివచ్చిందని నిలదీశారు.. తెలంగాణలో ఆటమొదలైందన్నారు ఈటల.. 2023లో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని చెప్పారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ కు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ లీడర్ వివేక్ వెంకట స్వామి, విజయశాంతితో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరై మాట్లాడారు. 

అంతకు ముందు శామీర్ పేట నివాసం నుంచి ర్యాలీగా గన్ పార్క్ కు చేరుకున్న ఈటల రాజేందర్ కు వివేక్ వెంకటస్వామి ఘనస్వాగతం పలికారు.. బండి సంజయ్ తో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళులర్పాంచారు ఈటల. అసెంబ్లీ ముందున్న పటేల్ విగ్రహానికి పూలమాలవేశారు..తర్వాత ర్యాలీగా బీజేపీ స్టేట్ ఆఫీస్ కు చేరుకున్నారు.. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.