డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ అభివృద్ధి

డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ అభివృద్ధి

దేశంలోనే వరస్ట్ సీఎం కేసీఆర్ అని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలన ఏ మాత్రం బాగాలేదని తెలిపారు. ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా కీసర మండలం చీర్యాల గ్రామంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారిని చైతన్యపరచడానికే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. నిజాం పాలన తర్వాత కేసీఆర్ పాలనలోనే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

ప్రజల సొమ్ముతో సీఎం కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకుంటోందని జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయని..డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.