పవిత్రమైన గుడిలో కేసీఆర్ బొమ్మలా? : రాజాసింగ్ ఫైర్

పవిత్రమైన గుడిలో కేసీఆర్ బొమ్మలా? : రాజాసింగ్ ఫైర్

యాదాద్రి గుడిలో నిర్మిస్తున్న స్థంబాలపై సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ గుర్తులు ఉండటంపై గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు రాజాసింగ్ ఫైర్ అయ్యారు. పవిత్రమైన గుడిలో పార్టీ ప్రభుత్వ పథకాల బొమ్మలు పెట్టడం సిగ్గుచేటన్నారు. ఇందుకు…  ప్రజలకు కేసీఆర్ క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే గుడిలోని స్థంబాలపై ఉన్న బొమ్మలను తొలగించాలని, లేకుంటే ప్రజలతో కలిసి వచ్చి తామే తీసివేస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.

గుడి టీఆర్‌ఎస్ పార్టీది కాదన్నారు రాజాసింగ్. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కానీ, కేసీఆర్ జేబునుంచి కానీ గుడిని అభివృద్ధిచేయడం లేదని ఆయన అన్నారు. అది ప్రజల గుడి అని.. దానిపై రాజకీయనాయకుల బొమ్మలు, పార్టీల బొమ్మలు, పథకాల బొమ్మలు ఉండకూడదని తీవ్రమైన స్వరంతో అన్నారు రాజాసింగ్. ఒకవేల కేసీఆర్ కు ఈ విషయాలు తెలువకుండా జరిగితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఏరాష్ట్రంలో కూడా ఆయా ప్రభుత్వాలు డెవలప్ చేసిన గుడిపై… వారి పార్టీకి సంబంధించిన గుర్తులను గుడిలో వేయలేదని అన్నారు రాజాసింగ్.