పంచాయతీలను స్పెషల్ ఆఫీసర్ల చేతిలో పెట్టొద్దు : మురళీధర్ రావు

పంచాయతీలను స్పెషల్ ఆఫీసర్ల చేతిలో పెట్టొద్దు : మురళీధర్ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేదాకా ప్రస్తుత సర్పంచులనే కొనసాగించాలని బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ చార్జ్ మురళీధర్ రావు కోరారు. ఫిబ్రవరి 1తో ముగియనున్న సర్పంచుల పదవీకాలాన్ని మరికొంత కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచుల బిల్లులను  రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని గుర్తుచేశారు.  

సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ ముందుకు పడటం లేదని, బీఆర్ఎస్ అధినేతతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయిందని ఆరోపించారు.