భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నాలుగు చోట్ల ప్లాస్టిక్​ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు : కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​​

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నాలుగు చోట్ల  ప్లాస్టిక్​ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు : కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో నాలుగు చోట్ల ప్లాస్టిక్​ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్ ​ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​ నుంచి అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​తో కలిసి పలు శాఖల ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లెందు, చుంచుపల్లి, అశ్వారావుపేట, మణుగూరు ప్రాంతాల్లో ప్లాస్టిక్​ వ్యర్థాల నిర్వహణ యూనిట్ల స్థాపనకు ప్లాన్ చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా ప్రతినెలా మొదటి, మూడో శుక్రవారం డ్రైడే నిర్వహించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించేలా పక్కా ప్రణాళికలను రూపొందించాలన్నారు.

 మే చివరి నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే స్టూడెంట్స్​కు యూనిఫామ్స్​ ఇచ్చేలా ప్లాన్​ చేయాలన్నారు. ఈసారి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని చెప్పారు. రాజీవ్​ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనను స్పీడప్​ చేయాలన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించాలని,  బోరు బావి ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో ఫాం పాండ్స్​ ఏర్పాటు చేయాలని  చెప్పారు. పెండింగ్​లో ఉన్న రేషన్​ కార్డుల దరఖాస్తుల పరిశీలన వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​ ఇందిర, భూగర్భ జల అభివృద్ధి శాఖ ఏడీ రమేశ్, మిషన్​ భగీరథ ఈఈలు తిరుమలేశ్, నళిని పాల్గొన్నారు.

చాతకొండ బెటాలియన్​లో పర్యటన 

లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ ఆరో బెటాలియన్​లో కలెక్టర్​ జితేశ్​ పర్యటించారు. వంద మంది సభ్యులతో కూడిన స్టేట్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్​తో మాట్లాడారు. ఆపద వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వారి వద్ద ఉన్న పరికరాలను పరిశీలించారు. మట్టి ఇటుకలతో రోడ్డు నిర్మాణాలకు చేస్తున్న ప్రయోగాలను పర్యవేక్షించారు. బెటాలియన్​ అసిస్టెంట్​కమాండర్​అబ్దుల్​ రషీద్​ బెటాలియన్​లో చేపడుతున్న అభివృద్ధిని వివరించారు. 

పాఠశాలలకు కొత్త హంగులు అద్దాలి 

పాల్వంచ : వచ్చే విద్యా సంవత్స రం నాటికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలను కొత్త హంగులతో తీర్చిదిద్దాలని కలెక్టర్ జితేశ్​అధికారులను ఆదేశించారు. పాల్వంచ పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న రిపేర్లను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. తరగతి గదుల్లో ఎలాంటి రంగులు వేయాలో పెయింటర్స్ కు వివరించారు.