
కరీంనగర్ టౌన్, వెలుగు: అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఉత్తమ మహిళా డిగ్రీ కాలేజీగా అవార్డు దక్కించుకున్నట్లు కరస్పాండెంట్ రవీందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఢిల్లీలోని ఆసియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన ప్రపంచ విద్యాసమ్మిట్ 2025లో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి భూషణ్ చౌదరి, ఫిజి కమిషన్ కౌన్సిలర్ నీలేశ్‌కుమార్ తదితరులు ఈ అవార్డును అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో మహిళా విద్యావికాసానికి సమర్థంగా సేవలందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.