ఏప్రిల్​లో భద్రాద్రికి 2.78 లక్షల మంది భక్తులు వచ్చారు : ఈవో రమాదేవి

ఏప్రిల్​లో భద్రాద్రికి 2.78 లక్షల మంది భక్తులు వచ్చారు : ఈవో రమాదేవి

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామిని ఏప్రిల్​లో 2,78,730 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో రమాదేవి గురువారం ప్రకటించారు. గత సంవత్సరం అదే నెలలో 2,27,884 మంది భక్తులు వచ్చినట్లు తెలిపారు. భక్తుల కోసం దేవస్థానంలో అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని, వేసవి సెలవుల నేపథ్యంలో ఇంకా సౌకర్యాలు పెంచుతున్నామని ఈవో చెప్పారు. కాగా, స్వామికి గర్భగుడిలో గురువారం ఉదయం సుప్రభాత సేవ జరిగింది. 

బాలబోగం నివేదించాక ప్రత్యేక హారతులు సమర్పించారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణ క్రతువును నిర్వహించారు. సాయంత్రం దర్బారు సేవ చేసి కాగడా హారతిని స్వామికి ఇచ్చారు.