
ఆమనగల్లు, వెలుగు: మాడ్గుల్ మండలంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వర్షానికి 31 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ఏవో అరుణకుమారి తెలిపారు. గురువారం ఆమె వడగండ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించారు.
నష్టం వివరాలను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. ఏఈఓ భార్గవి, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, రైతులు పర్వతాలు, రాంరెడ్డి, శేఖర్ రెడ్డి, అరవింద్ పాల్గొన్నారు.