
వనపర్తి, వెలుగు: బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత తీర్పు చెప్పినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. కొత్తకోట పోలీస్స్టేషన్ పరిధిలోని సంకిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చిన బాలికపై 2021 మే 18న అదే గ్రామానికి చెందిన జి. చెన్నయ్య లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి కొత్తకోట ఎస్సై నాగశేఖర్ రెడ్డి కేసు నమోదు చేయగా, సీఐ మల్లికార్జున్ రెడ్డి దర్యాప్తు చేశారు. ఈ కేసులో కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు.