
జిన్నారం, వెలుగు: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని డీఎంహెచ్ వో గాయత్రి దేవి గురువారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రసూతి సౌకర్యాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఇటీవల నిర్మించిన భవనాన్ని పరిశీలించారు. ప్రస్తుతం 14 మందికి ప్రసూతి సౌకర్యాన్ని కల్పించినట్లు డాక్టర్ కోమలి డీఎంహెచ్‌వోకు తెలిపారు.
ఆస్పత్రి పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రోగులకు మెరుగైన సేవలను అందించాలని వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ కోమలి, వైద్య సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.