
నెట్‌వర్క్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వాడవాడన గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు పట్టణాల్లో వివిధ పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండాలను ఎగరేసి కార్మిక ఐక్యతను చాటారు. వేములవాడలోని గుమ్మి పుల్లయ్య భవన్‌లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జెండాను ఎగురేశారు. సుల్తానాబాద్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు పాల్గొన్నారు. భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల హక్కులను కాపాడేది ఎర్రజెండా మాత్రమేనన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందన్నారు. సింగరేణి కోల్‌బెల్ట్ గోదావరిఖనిలో వాడవాడలా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎర్రజెండాలను ఎగరేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 139 మీటర్ల ఎర్ర జెండాను గోదావరిఖని పట్టణంలో ప్రదర్శించారు. ఎన్టీపీసీ ప్లాంట్‌లో ఈడీ చందన్ కుమార్సమంత, పాల్గొన్నారు. మంథని కోర్టు ప్రాంగణంలో సీనియర్‌సివిల్ జడ్జి భవాని ఆధ్వర్యంలో మేడ వేడుకలు నిర్వహించారు. కోనరావుపేట, మానకొండూర్ మండలకేంద్రాల్లో ఎర్రజెండా ఎగరేశారు.