ప్రతీ ఒక్కరు విక్రమాదిత్య చరిత్రను తెలుసుకోవాలె: మురళీధర్ రావు

 ప్రతీ ఒక్కరు విక్రమాదిత్య చరిత్రను తెలుసుకోవాలె: మురళీధర్ రావు

ప్రతీ ఒక్కరు సామ్రాట్ విక్రమాదిత్య చరిత్రను తెలుసుకోవాలని బీజేపీ జాతీయ నేత, మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు సూచించారు. సామ్రాట్ విక్రమాదిత్య నాటక ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు మన రాజుల గొప్పతనాన్ని, చరిత్రను తెలుసుకోవాలని చెప్పారు. విక్రమాదిత్య చరిత్ర కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తున్నారని తెలిపారు. దేశ భక్తి పేరుతో మహా యుద్ధం జరుతుందని గుర్తు చేశారు. భారత దేశం ఎన్ని శిఖరాలను అధిరోహించిందో అందరికి  అవగాహన ఉండాలన్నారు. విశ్వ గురు స్థానంలో దేశాన్ని నిలబెట్టాలి కోరారు.

200 కళాకారులతో విక్రమాదిత్య చరిత్రను నాటక రూపంలో ప్రదర్శిస్తున్నామని మురళీధర్ రావు తెలిపారు. మూడో రోజు కూడా విక్రమాదిత్య నాటక ప్రదర్శన ఉంటుందిని.. ప్రతి వ్యక్తి  విక్రమాదిత్య నాటకం చూసి ఆనందించాలన్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్లలోని హెచ్ఎంటి గ్రౌండ్ లో 200 మంది కళాకారులతో  విక్రమాదిత్య నాటక ప్రదర్శన జరుగుతోంది.