Viral Video: పెళ్లికూతురు డైనోసార్​ లా వచ్చి.. వరుడిని ఆట పట్టించింది..

Viral Video: పెళ్లికూతురు డైనోసార్​ లా వచ్చి.. వరుడిని ఆట పట్టించింది..

భారతీయుల పెళ్లిళ్ల సందడే వేరు.. పెళ్లి చూపుల దగ్గరనుంచి .. ఎంగేజ్​ మెంట్​..పసుపు కొట్టడం.. పెళ్లికూతురిని చేయడం దగ్గర నుంచి.. పెళ్లి తంతు ముగిసే వరకు ఒకటే హడావిడి.. సందడి.. ఇక ఈ మధ్య కాలంలో వధూవరుల డ్యాన్స్​లు.. కొన్ని వింత వింత ఘటనలు సోషల్​మీడియా పుణ్యమా అని ఏ పెళ్లిలో ఏ చిత్ర విచిత్ర ఘటన జరిగినా వైరల్​ అవుతుంది. 

తాజాగా ఓ పెళ్లికూతురు హల్దీ ఫంక్షన్​ లో చేసిన చిలిపి చేష్టల వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.   మల్కీత్ షేర్‌గిల్  అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను  పోస్ట్ చేశారు. హల్దీ ఫంక్షన్​ లో పెళ్లి కూతురు చేసిన అల్లరి చేష్ఠలు చూసి అతిథులు షాకయ్యారు.  ఒక్క సారిగా అక్కడ డైనోసార్​ ప్రత్యక్షమయింది.  అది సందడి చేస్తూ.. జనాల్లో ఉత్సాహంగా తిరుగుతూ వరుడిని కవ్వించడం మొదలు పెట్టింది.  

డైనోసార్ కాస్ట్యూమ్‌లో ఉన్న  చేస్తూ తిరుగుతుంటే, గెస్టులు కేకలు వేస్తూ నవ్వు ఆపుకోలేకపోయారు.మొత్తం వాతావరణం మరింత ఉత్సాహంగా, పండగలా అనిపించింది.  అసలు మజా ఇప్పుడే మొదలైంది. పెళ్లికూతురు ఎక్కడ ఉందా అందరూ ఎతుక్కుంటుండగా.. డైనోసార్​ అసలు రూపం ప్రదర్శించింది.  ఇక అంతే పెళ్లి కొడుకు నవ్వుతూ సిగ్గులు వలకబోశాడు. 

ఆ పెళ్లికూతురే  ఫైనల్‌గా డైనోసార్ కాస్ట్యూమ్ తీసి తన అసలు రూపాన్ని చూపించింది. గెస్టులు ఇంకోసారి బిగ్గరగా నవ్వడం, కేకలు వేయడం మొదలుపెట్టారు.పెళ్లికొడుకు రియాక్షన్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్.మొదట్లో షాక్ అయినా, తర్వాత నవ్వు ఆపుకోలేకపోయాడు.ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. మీ క్రియేటివిటీకి ఓ దండంరా బాబూ అని ఒకరు కామెంట్​ చేయగా.. మరొకరు ఈ ఫంక్షన్​ గ్రాడ్జిల్లా కాదు..బ్రైడ్జిల్లా అని కామెంట్​ చేశారు.  మరికొందరు పెళ్లికూతురు సృజనాత్మకతను కొత్త ప్యాషన్​ ను ప్రశంశించారు, ట్రెడిషనల్​ ఫంక్షన్​ లో ఇలాంటి ఘటనలు రీఫ్రెషింగ్​ అని కొందరు రాయగా.. మరొకరు పెళ్లిళ్లంటే ఇలాగే.. సరదాగా.. నవ్వులు విరజిల్లుతూ.. జీవితాంతకాలం గుర్తిండిపోవాలని రాసుకొచ్చారు. 

►ALSO READ | Viral Video: వామ్మో.. ఇదెక్కడి వంటంకం రా నాయినా.. బబుల్​గమ్​తో బిర్యానీ..