
నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే చాలు.. బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటారు.. లేదంటే హోటల్ కు వెళ్లి బిర్యానీ తింటారు. రక రకాల బిర్యానీలు మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. ప్రజలు వెరైటీ బిర్యానీలు తయారుచేస్తున్నారు అలాంటి ఒక వింత ట్విస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. తాజాగా హీనా కౌసర్ రాద్ బబుల్‌గమ్ తో బిర్యానీ చేసి ఆ వంటకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అయింది.
ఈ వీడియోలో ఒక చెఫ్ బబుల్ గమ్ బిర్యానీని స్టూడెంట్స్‌కు ఇస్తున్నట్లుగా ఉంది. విద్యార్థులకు ఈ బిర్యానీనీ తిని.. సర్టిఫికెట్ ఇవ్వమంది. బబుల్ గమ్ బిర్యానీ ప్లేట్ ను పరిశీలిస్తే..జిగటగా.. బబుల్ గమ్‌తో ఉంది. అబ్బాయిలు, మీరు బబుల్ గమ్ బిర్యానీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా?" అని ఆమె అడిగినప్పుడు, విద్యార్థులందరూ కలిసి, "లేదు" అని అంటారు. వారు దాని గురించి ఉత్సాహంగా లేరని స్పష్టంగా తెలుస్తుంది.
Also Read : చికెన్ తో చిల్.. చిల్ .. వెరైటీ రెసిపీ .. ఇలా తయారుచేసుకోండి..
ఈ వీడియో 1.7 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. ఒక బిర్యానీ ప్రేమికుడు అలా చేయవద్దు.. . బిర్యానీని సేవ్ చేయి” అని వేడుకున్నాడు. మరొకరు .. యా అల్లాహ్, అంటూ ఓ ప్రభూ బిర్యానీని రక్షించు అన్నాడు. ఇంకొరకు బిర్యానీకి న్యాయం చేయమని” అడిగాడు. ఇంకా చాలా మంది దయచేసి వివిధ రకాల బిర్యానీలు తయారు చేయడం ఆపండి” అని వేడుకున్నారు. ఒక వినియోగదారు బబుల్‌గమ్ బిర్యానీని “ఆహార వ్యర్థం” అని కామెంట్ చేశారు.