- ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఖానాపూర్, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులను సర్వే ఆధారంగానే ఎంపిక చేశామని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ చివరి రోజు వరకు నాలుగు సర్వేలు చేసి తుది అభ్యర్థుల జాబితా విడుదల చేశామన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖానాపూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పట్టణ ప్రజలను మో సం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
అనంతరం ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు కు చెందిన పలువురు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజీద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దయానంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ అంకం రాజేందర్, నాయకులు పాల్గొన్నారు.
