అవకాశం ఇస్తే హుజురాబాద్ నుంచి పోటీ చేస్తా

అవకాశం ఇస్తే హుజురాబాద్ నుంచి పోటీ చేస్తా

అధిష్టానం ఆదేశిస్తే హుజురాబాద్  ఉపఎన్నికలో పోటీచేస్తానన్నారు బీజేపీ నేత పెద్దిరెడ్డి. హుజురాబాద్ కు ఎన్నికలు ఇప్పుడే రావని..మరో ఆరు నెలల సమయం పట్టొచ్చన్నారు. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. హుజురాబాద్ బీజేపీ టికెట్ కేటాయింపు విషయంలో అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానన్నారు. హుజురాబాద్ లో అభివృద్ధి జరగలేదన్నారు. హుజురాబాద్ ను జిల్లా చేయాలన్నారు. 2018 లో పోటీ చేద్దామనుకుంటే అలయెన్స్ లో కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించారన్నారు. తాను కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసినట్లు.. టిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు.  బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరికి  టికెట్ అడిగే హక్కు ఉంటుందన్నారు.. కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు.