కేసీఆర్​పై బీజేపీ నేత పొంగులేటి ఫైర్

కేసీఆర్​పై బీజేపీ నేత పొంగులేటి ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీని అధికారం లోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని, సెంట్రల్ స్కీమ్ లను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తల ను కోరారు. మంగళవారం మహబూబ్ నగర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భాగంగా పొంగులేటి మాట్లాడారు. ప్రపంచంలో నంబర్ వన్  నాయకుడిగా ఎదుగుతున్న ప్రధాని మోడీని చూసి కొందరు ఓర్వడం లేదని మండిపడ్డారు. అంతర్జాతీయ కుట్రతో బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీని వెంటనే తొలగించాలని, ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.