- ఉపరాష్ట్రపతికి బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: భద్రాచలం ఆలయ సందర్శనకు రావాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ను బీజేపీ నేత, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల జాతీయ సహ- ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. ఆదివారం హైదరాబాద్కు వచ్చిన ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతితో పొంగులేటి సుధాకర్ రెడ్డి భేటీ అయ్యారు. దేశంలో అత్యంత గౌరవప్రదమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. భద్రాచలం ఆలయానికి ఉన్న ఘనమైన చారిత్రక వారసత్వం, సాంస్కృతిక ప్రాముఖ్యత, తెలంగాణ సంప్రదాయాలతో పాటు దేశ ఆధ్యాత్మిక వారసత్వంతో ఆ ఆలయానికి ఉన్న అనుబంధాన్ని ఆయన ఉపరాష్ట్రపతికి వివరించారు.
