రెగ్యులర్ సెక్రటరీని నియమించాలి

 రెగ్యులర్ సెక్రటరీని నియమించాలి

కోహెడ, వెలుగు: కాంగ్రెస్ పాలనలో ఫుల్ టైం పంచాయతీ సెక్రటరీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వెంకటేశం అన్నారు. గురువారం మండలంలోని రాంచంద్రపూర్ లో జీపీ ఎదుట నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఏడాది నుంచి గ్రామానికి ఇన్​చార్జి సెక్రటరీలే దిక్కవుతున్నారన్నారు. వెంటనే రెగ్యులర్ సెక్రటరీని నియమించాలని డిమాండ్ చేశారు. తోటపల్లి ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం తీసుకొన్న భూముల్లో పంటలు వేసుకున్న రైతులకు యూరియా ఇవ్వడం లేదన్నారు. 

దీంతో రైతుల పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు నిబంధనలు లేకుండా యూరియా అందించాలని కోరారు. కార్యక్రమంలో వికాస్ రెడ్డి, లక్ష్మణ్, దామోదర్, ఆంజనేయులు, సతీశ్, శ్రీనివాస్, తిరుపతి, లక్ష్మారెడ్డి ఉన్నారు.