మేనిఫెస్టోలోని అంశాలకు సలహాలు తీసుకుంటాం : రాంచందర్ రావు

మేనిఫెస్టోలోని అంశాలకు సలహాలు తీసుకుంటాం : రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని బీజేపీ నేత,  మాజీ ఎమ్మెల్సీ రాంచందర్​రావు అన్నారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఆ కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. గురువారం బీజేపీ స్టేట్​ఆఫీస్​లో పార్టీ మేనిఫెస్టోపై జరిగిన వర్క్​షాప్‌లో ఆయన మాట్లాడారు. 

అన్ని వర్గాల ప్రజలతో సమావేశాలను నిర్వహించి మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై చర్చిస్తామని చెప్పారు. వారి అభిప్రాయాలనూ తీసుకుంటామన్నారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ అభిప్రాయాల సేకరణ కోసం ఎల్​ఈడీ వాహనాలను తిప్పుతామన్నారు. 

మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలను ప్రజలు చెప్పాలనుకుంటే 90909 02024 నంబర్​కు మిస్డ్​ కాల్​ ఇస్తే.. తిరిగి ఫోన్​ చేస్తామన్నారు. ఆ తర్వాత ప్రజలు చెప్పే సలహాలను రికార్డ్​ చేసుకుంటామన్నారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి నమో యాప్ లో అప్ లోడ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది నుంచి అభిప్రాయాలను సేకరిస్తామని చెప్పారు.