V6 News

మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏవి? : బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్

మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏవి? : బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్

ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా పెంబి, లింగాపూర్, ఖానాపూర్​లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నిర్మల్​జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ విమర్శించారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట విస్తారంగా సాగవుతుందని, పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

రైతుల సమస్యలను ఇప్పటికైనా అధికారులు, పాలకులు గుర్తించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎ.శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, నేతలు పాల్గొన్నారు.