ప్రధాని రాకతో రాష్ట్రంలో కాషాయ శకం ప్రారంభమైంది

ప్రధాని రాకతో రాష్ట్రంలో కాషాయ శకం ప్రారంభమైంది

ప్ర‌ధాని మోడీ రాక‌తో తెలంగాణ‌లో కాషాయ శ‌కం ప్రారంభ‌మైందన్నారు బీజేపీ నేత విజయశాంతి. ఆయన రాక‌తో తెలంగాణ‌లో కొత్త మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుందని చెప్పారు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని కేసీఆర్ నియంత్వ్ర పాల‌న‌పై ప్ర‌ధాని మోడీ ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధిని ఒక ఫ్యామిలీ అణచివేయాలని చూస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది అమరులయ్యారు. ఒక్క ఆశయం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. కానీ కేసీఆర్ నిరంకుశ పాలనలో ఎవరి ఆకాంక్షలు నెరవేరడం లేదని మోడీ అన్నట్లు ఆమె చెప్పారు.

తెలంగాణకు విముక్తి కావాలి..కుటుంబ పాలనను, కుటుంబ పార్టీలను తరిమేస్తేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని స్ప‌ష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తమ‌ని తేల్చి చెప్పారు. మోడీ వ‌స్తున్న‌ారంటేనే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు వెన్నులో వ‌ణుకు పుడుతోందని ఆమె విమర్శించారు. అందుకే కర్ణాట‌క‌కు పోయి దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఏం పని ఉందని బెంగుళూర్ వెళ్లారు?.. సమస్యలు ఉంటే మోడీని సీఎం నేరుగా కలిసి చెప్పుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్ర‌తిదానికి కేంద్రంపైన, ప్ర‌ధానిగారిపైన ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌ప్ప...కేసీఆర్ కు ఇంకేదీ చేత కాదని మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ కోసం కార్యకర్తలు పోరాడుతున్న తీరును ప్రధాని ప్రస్తావించడంతో కాషాయదళంలో కొత్త కళ కనిపించిందని..ఇదే ఉత్స‌హంతో కేసీఆర్‌ను గ‌ద్దె దించి కాషాయ జెండాను ఎగ‌రేస్తామని విజయశాంతి దీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం

బౌలర్ కు చుక్కలు..ఒకే ఓవర్లో ఐదు సిక్సులు,ఒక ఫోర్

మూడో రోజు సీబీఐ విచారణకు కార్తీ చిదంబరం